Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్ !!! చాలా సంతోషం : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్

  • ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా సంతోషం
  • నువ్వు ‘మెగా’ కాంబోకు చెందిన సూపర్ స్టార్ వి
  • గాడ్ బ్లస్ యూ, గర్వంగా ఉంది
  • అత్యద్భుతమైన చిత్ర యూనిట్ కు అభినందనలు! సలాం
‘రంగస్థలం’ విజయోత్సాహంలో ఉన్న హీరో రామ్ చరణ్ కు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా, బాలావుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా ప్రశంసలు కురిపించిన వారి జాబితాలో చేరిపోయాడు. రామ్ చరణ్ ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

‘చిట్టిబాబూ సౌండ్ ఇంజనీర్!!! రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది మై బ్రదర్ రామ్ చరణ్! ... నువ్వు ‘మెగా’ కాంబోకు చెందిన సూపర్ స్టార్, సూపర్ పర్ఫార్మర్ వి. గాడ్ బ్లస్ యూ, గర్వంగా ఉంది! అత్యద్భుతమైన చిత్ర యూనిట్ కు అభినందనలు! సలాం’ అని  ఆ ట్వీట్ లో వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు. కాగా, ‘రంగస్థలం’ విజయోత్సవ సభ ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
Ramcharan
vivek oberoi

More Telugu News